దేశంలో ‘గ్రేటర్’ హైదరాబాద్!

265

పురపాలనలో తెలంగాణ రాష్ట్రం మరో ఘనత సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పట్తణ స్థానిక సంస్థలు(యుఎల్‌బి)పై కేంద్రం నిర్వహించిన ‘ఎకనమిక్ సర్వే 2016-17’లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపాలిటీ కార్పొరేషన్ వివిధ కేటగిరీల్లో ప్రథమ స్థానం పొందింది. పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం, పారిశుద్ధ్య భాగస్వామ్యం, ఆదాయ వనరుల పరంగా హైదరబాదు దరిదాపుల్లో మరో కార్పొరేషన్ లేదు. మొత్తం 500 యుఎల్‌బిలను సర్వేకి స్వీకరించగా, గ్రేటరుకే ఆ ఘనత దక్కింది. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు జిహెచ్ఎంసి అధికారులను అభినందించారు.