ద‌డపుట్టిస్తోన్న వ‌డ‌గాలులు

251

తెలంగాణ‌లో సోమ‌వారం ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు భారీగా పెరిగాయి. దీనికి వ‌డ గాలులు తోడుకావ‌డంతో జ‌నం అల్లాడిపోయారు. సాధార‌ణంకంటే 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్ర‌త‌ల్లో పెరుగుద‌ల క‌నిపిస్తోంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌, మరాట్వాడ, తెలంగాణ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో తీవ్రస్థాయి ఉష్ణగాలుల ప్రభావం కొనసాగుతోందని  వారు పేర్కొన్నారు. కాగా సోమ‌వారం  ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రామగుండం, మెదక్‌లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 41, హన్మకొండ, హైదరాబాద్‌, ఖమ్మం, నల్గొండలో 40, హకీంపేటలో 39 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.