పీజీ మెడికల్ ప్రవేశాలు షురూ

529

రాష్ట్రంలో పీజీ మెడికల్ సీట్ల భర్తీ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైంది. ఈ సీట్ల భర్తీకి సంబంధించి కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్శిటీ ప్రకటన విడుదల చేసింది. 11 నుంచి 17 వరకూ అభ్యర్థులు పీజీ మెడికల్ విద్యలో ప్రవేశానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19న నీట్‌ ర్యాంకుల ఆధారంగా రాష్ట్రస్థాయి అర్హుల జాబితాను ప్రకటిస్తారు. 21 నుంచి ఐదు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలున్నాయి. అనంతరం 27, 28 తేదీల్లో తొలిదశ ప్రవేశాలకు వెబ్‌ ఆప్షన్లను ఎంపిక చేసుకోవడానికి అవకాశమిస్తారని వర్సిటీ వర్గాలు తెలిపాయి.