ఇక ఇంటి వ‌ద్ద‌కే ఆర్టీసీ బ‌స్సు

261

ఆర్టీసీ చ‌రిత్ర‌లో తొలిసారి ప్ర‌యాణికుల‌ను వారివారి ఇళ్ల వ‌ద్ద‌కు చేర్చే ప్ర‌క్రియ చేప‌ట్టింది. వారంలోగా ఆర్టీసీ కొత్త‌గా 303 బ‌స్సులు స‌మ‌కూర్చుకుంటోంది. వీటిలో వ‌జ్ర పేరిట కొన్ని మినీ బ‌స్సుల‌ను కొనుగోలు చేయ‌నుంది. ఏసీ, నాన్ ఏసీ కేట‌గిరీల్లో ఈ బ‌స్సుల‌ను మొద‌ట హైదరాబాద్-వరంగల్‌రూట్లో 60 ట్రిప్పులు, హైదరాబాద్- నిజామాబాద్ రూట్లో 36 ట్రిప్పులు న‌డ‌ప‌నుంది. సంస్థ చరిత్రలో తొలిసారిగా ఈ బస్సులు ప్రయాణికులు నివసించే సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బోర్డింగ్ పాయింట్లలో ఎక్కించుకుని గమ్యస్థానాల్లో ఇంటికి సమీపంలో ఏర్పాటు చేసే కేంద్రం వద్ద దించుతాయి. దీంతో ప్రయాణికులకు సమయంతో పాటు, బస్టాండుకు చేరుకునేందుకు అయ్యే రవాణా ఖర్చులు కూడా తగ్గనున్నాయి. వీటిలో పాటు మినీ పల్లెవెలుగు, సూపర్ లగ్జరీ, రాజధాని ఏసీ, గరుడ ప్లస్ బస్సులు వ‌చ్చే వారంలో ఆర్టీసికి చేర‌తాయి. వీటిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిచడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది.