చిరు, పవన్ సినిమా నిజమే..

256

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల కలయికలో ఓ మల్టీస్టారర్ మూవీ రానుంది. ఈ వార్త నూటికి నూరు శాతం వాస్తవమేనని ప్రముఖ నిర్మాత, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి స్పష్టంచేశారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. చిరు, పవన్ సినిమాకి అశ్వనీ దత్ నిర్మాతగా ఉంటారని సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో సహజంగానే ఎక్కువగా అంచనాలు ఉంటాయని, అందుకనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నామన్నారు. కాగా మహాశివరాత్రి సందర్భంగా విశాఖ సాగరతీరంలో లలిత కళాపరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కోటి శివలింగ ప్రతిష్ట, మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శారదాపీఠానికి చెందిన స్వామి స్వరూపానంద సరస్వతి, పలువురు మంత్రులు, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు.