ఈ వారం రాశిఫలం (ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 11, 2017 వరకూ)

5372

vara– సమయ, samaya@imail.com
మేషరాశి

(అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం)

ariesమీదైన సొంత ఆలోచనలతో ముందుకు సాగిపోండి. మీలోని శక్తియుక్తులను బయటకు తీయండి. మీ కలలు, కోరికలు నెరవేర్చుకోవడానికి అహర్నిశలూ శ్రమించండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఈ ప్రయత్నంలో ఇతరులతో గొడవలకు దిగకండి.  అన్ని విషయాలలోనూ సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. చేసిన తప్పుల గురించి ఆలోచించడం మానేయండి. సమయం, డబ్బు వృధా అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయండి. కుటుంబ వాతావరణం మీకు సంతృప్తిని కలిగించదు. ఉద్యోగ పరంగా ఒడిదుడుకులు ఏర్పడతాయి. వాహనయోగం ఉంది.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                       అనుకూల తేదీలు: 7, 8
ప్రతికూల తేదీలు : లేవు

వృషభరాశి

(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1,2 పాదాలు)

Taurusఅంతా మీరు అనుకున్నట్లే జరుగుతుంది. పని పట్ల ఉత్సాహం చూపించి మంచి విజయాలు నమోదు చేస్తారు. మీ శ్రమ ఫలించాలంటే నిజాయితీగా ప్రయత్నించండి. మీలోని నైపుణ్యాలు వెలుగుచూస్తాయి. అందరి మన్ననలూ అందుకుంటారు. పోటీపరీక్షలలో గెలుపొందుతారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేముందు పెద్దల సలహా తీసుకోండి. ఇంటికి వచ్చిన అతిథులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు లేదా అతిథుల రాకతో శ్రమాధిక్యత, అలసట ఉంటుంది.

అనుకూల తేదీలు: 7, 8
ప్రతికూల తేదీలు : 10, 11

మిథున రాశి

(మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

geminiనూతన బాధ్యతలు స్వీకరిస్తారు. తద్వారా పనిలో ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కార్యాలయంలో సానుకూల వాతావరణం నెలకొంటుంది. వారాంతంలో చిన్నచిన్న విహార యాత్రలతో ఉల్లాసం పొందండి. బంధువులతో, సహోద్యోగులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. మీ ప్రవర్తన సన్నిహితులను బాధిస్తుంది. కుటుంబంలోని పెద్దలు మీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు. రావలసిన బాకీలు ఆలస్యమవుతాయి. సంతానం అభివృద్ధి మీకు సంతృప్తినిస్తుంది. జీవితభాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

అనుకూల తేదీలు: 5, 6
ప్రతికూల తేదీలు : 7, 8

కర్కాటక రాశి

(పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు)

cancerఈ వారం మీకు అనుకూల ఫలితాలేర్పడతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలు చేపడతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. చిన్నచిన్న ఆటంకాలెదురైనా చివరకు చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. అధికారుల  ప్రోత్సాహం ఉంటుంది. పెద్దల సహకారం మీపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే అతిగా ఇతరులపై ఆధారపడకండి. స్వయంకృషికి ప్రాధాన్యతనివ్వండి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సోదరీ, సోదరులతో విభేదాలు కలుగుతాయి. మీ వైవాహిక బంధం బలపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో సంతోషాలు పెరుగుతాయి.

అనుకూల తేదీలు: 7, 8
ప్రతికూల తేదీలు : 11

సింహరాశి

(మఖ 4వ పాదం, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం)

Leoఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనోధైర్యంతో ఆశించిన ఫలితాలు అందుకోవడానికి శక్తికి మించి కృషి చేస్తారు. పెద్దమొత్తాల కొనుగోళ్లు వాయిదా వేయండి. వాహన యోగం పెరుగుతుంది. విహార యాత్రలు చేస్తారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు ఏర్పడకుండా ఉండేలా ప్రయత్నించండి. శత్రువులు మీపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మీ సన్నిహితులే మీకు ద్రోహం చేయాలనుకుంటారు. అయితే వారి ప్రయత్నాలు సఫలం కావు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. మీ వైవాహిక జీవితం ఆనందాన్నిస్తుంది.

అనుకూల తేదీలు: 9, 10
ప్రతికూల తేదీలు : లేవు

కన్యారాశి

(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

Virgoఅన్నింటా అప్రమత్తంగా ఉండాలి. అధికారులతో సంయమనంతో వ్యవహరించాలి. ఉద్యోగంలో స్వీకరించిన నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే ఓర్పు అవసరం. భాగస్వామ్య వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు ఏర్పడకుండా చూసుకోండి. సంతాన విషయంలో అసంతృప్తి ఉంటుంది. పోటీ పరీక్షల్లో గెలుపొందుతారు. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. కీలక నిర్ణయాల అమలులో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. పెరుగుతున్న ఖర్చులు మీకు ఋణావసరాలను పెంచుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ విశ్వాసాన్ని సడలనివ్వవద్దు.

అనుకూల తేదీలు: లేవు
ప్రతికూల తేదీలు : 8, 9

తులారాశి

(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1వ పాదం)

libraమానసిక ప్రశాంతత సాధించడానికి ప్రయత్నాలు చేయండి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడినా చివరకు పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారాలుంటాయి. ముఖ్యమైన విషయాలలో ఇతరులపై ఆధారపడడం మీకు ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ ఎవ్వరికైనా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నడుచుకోక తప్పదు.  ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సంతాన పురోగతి సంతృప్తిని కలిగిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితం సరదాగా సాగిపోతుంది. దూర ప్రయాణాలు చేయడానికి సంకల్పం చేస్తారు.

అనుకూల తేదీలు: 10
ప్రతికూల తేదీలు : 5, 6

వృశ్చిక రాశి

(విశాఖ : 4వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)

scorpioమీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు పూర్తిచేస్తారు. నేడు గడుపుతున్న ప్రతిక్షణం రాబోయే రోజులకు పెట్టుబడులుగా భావిస్తారు. చిన్న పని అయినా ప్రణాళికాబద్ధంగా చేసినప్పుడే విజయం సాధించగలమని నమ్ముతారు. ఆదాయ వ్యయాలు సమతూకంలో ఉంటాయి. ఋణాలు చెల్లించే ప్రయత్నాలు చేస్తారు.  పొదుపుకు అవకాశం దక్కదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.  న్యాయవివాదాలు చోటుచేసుకుంటాయి. అనుకోని రీతిలో బదిలీలు జరుగుతాయి. నిజమైన స్నేహితుల సాహచర్యంలో మీ మనసుకు సాంత్వన లభిస్తుంది.

అనుకూల తేదీలు: 7, 8, 9
ప్రతికూల తేదీలు : 11

ధనూరాశి

(మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం)

sagitarus-300x207బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నూతనంగా ఆరంభించిన వ్యాపారాలలో ప్రారంభంలో నష్టాలు చవిచూడాల్సి వచ్చినా క్రమేపీ పుంజుకుంటాయి. నిరుత్సాహ పడకండి. మిత్రులే శత్రువులవుతారు. అధికారుల తీరు నిరుత్సాహ పరుస్తుంది. నిందారోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. జాగ్రత్త వహించండి. దైవభక్తి పెరుగుతుంది. వాహన ప్రమాదాలు సూచితం. అంచనాల మేరకు ఆదాయాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో వివాదాలు చోటుచేసుకుంటాయి. ఒంటరితనం మిమ్మల్ని బాధిస్తుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ వాటివల్ల ఆశించిన ప్రయోజనాలు సాధిస్తారు.

అనుకూల తేదీలు: 8
ప్రతికూల తేదీలు : 6

మకర రాశి

(ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)

Capricornఆశించిన పదవి లభిస్తుంది. ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకుంటారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అదుపులో పెట్టుకోండి. శ్రమాధిక్యంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రణాళికా బద్ధంగా పనిచేస్తారు. పెట్టుబడులు వాయిదా వేసుకోండి. దేవతా దర్శనం తరచుగా చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంక్ లోన్లు మంజూరవుతాయి. మనసులోని మాటలు ఇతరులతో పంచుకునేటప్పుడు మెళకువలు పాటించండి. ఉదర వ్యాధులు బాధిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడిపి విశ్రాంతిని పొందండి.

అనుకూల తేదీలు: 10, 11
ప్రతికూల తేదీలు : 8, 9

కుంభరాశి

(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)                                                                                                                  aquarius-300x207

పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ నూతన పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అప్పుడే ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు కలిసి వస్తాయి. మీ భవిష్యత్తుకు ఉపకరించే వ్యక్తుల పరిచయం కలుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే పనిలో ఒత్తిడి మీలో ఆందోళన పెంచే అవకాశం ఉంది. అధికారులు, పెద్దల ప్రోత్సాహంతో ఒత్తిడి నుంచి బయటపడతారు. సంతానం అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారులకు కలిసివచ్చే కాలం.

అనుకూల తేదీలు: 5, 6
ప్రతికూల తేదీలు : 9

మీనరాశి

(పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)

piscesవివాహాది శుభకార్యాలు ఖరారు చేసుకుంటారు. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఋణాలు తీరుస్తారు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు మెళకువలు పాటించండి. పిల్లల విద్యా, ఉద్యోగ విషయాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు. మీ మాటలు ఇతరులను బాధపెట్టే అవకాశం ఉంది. మాట దురుసుతనం లేకుండా చూసుకోండి.  కొన్ని వ్యవహారాలలో సమస్యలు ఏర్పడినా తొందరలోనే అవి మబ్బుల్లా తేలిపోతాయి. ఉద్యోగంలో మీ హోదా పెరిగే అవకాశం ఉంది.

అనుకూల తేదీలు: 7, 8, 9
ప్రతికూల తేదీలు : లేవు