మోడీపై ఆస్ట్రేలియా ప్రధాని ప్రశంసల జల్లు

184

ప్రధాని నరేంద్ర మోడీపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్‌ టర్న్ బుల్‌ ప్రశంసల జల్లు కురిపించారు. మోడీ నాయకత్వంలో భారత్ ప్రగతిపథంలో దూసుకుపోతోందని ప్రశంసించారు. దేశంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అస్ట్రేలియా ప్రధాని ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. భారత్‌తో గతంలో కంటే మరింత మెరుగైన సంబంధాలను తాము కోరుకుంటున్నట్టు మాల్కోమ్  తెలిపారు.