రాజాసింగ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

177

గోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మ‌రోసారి వివాదాస్స‌ద వ్యాఖ్య‌లు చేశారు. అయోధ్య‌లో వివాదాస్ప‌ద రామ‌జ‌న్మ భూమిలో వ‌చ్చే శ్రీ‌రామ న‌వమిలోగా రామ‌మందిరం నిర్మించి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు ఇవ్వ‌డానికైనా..ప్రాణాలు తియ్య‌డానికైనా సిద్ధం అంటూ వివాదాస్స‌ద వ్యాఖ్య‌లు చేశారు. న‌గ‌రంలో గురువారం జ‌రిగిన ఓ స‌భ‌లో రాజాసింగ్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది.