క్రేన్ కూలి మహిళ మృతి

263

 నగరంలోని బండ్లగూడ ఇంద్రప్రస్త కాలనీలో ప్రమాదం జరిగింది. భవనం పై నుంచి క్రేన్ కూలడంతో జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు