ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్

266

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మధ్యాహ్నం ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చిస్తారు. మరోమంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కేటీఆర్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో ఆయన సమావేశమై ఉపాధి హామీ, ఆసరా పింఛన్లు సహా పలు అంశాలపై చర్చించనున్నారు.