కళాకారులను ప్రోత్సహించాలి

172

సంస్కృతి, సంప్రదాయాలు కాపాడటంలో కళాకారుల కృషి ప్రశంసనీయమని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. హుజారాబాద్ లో కళారవళి సోషియో కల్చరల్‌ అసోసియేషన్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ గిరిజన, జానపద కళోత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల ప్రదర్శన చాలా కష్టంతో కూడుకున్న పనిఅని, వాటిని ప్రదర్శించడంలో కళకారులు పడుతున్న కష్టాలను ప్రజలు గుర్తించి ప్రోత్సాహించాలని కోరారు. అనంతరం తెలంగాణ రాష్ట్రస్థాయి పునరంకిత పురస్కార గ్రహితలకు అవార్డులను ఆయన ప్రదానం చేశారు.