ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డ మంత్రి

203

విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఆదివారం ఓ రోడ్డు ప్ర‌మాదం నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మంత్రి కాన్వాయ్‌ లోని వాహనం ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. న‌ల్గొండ‌ జిల్లా కట్టంగూర్‌ మండలం ఐటీపాముల వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ప్రమాదం నుంచి మంత్రి సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్ లోని ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మంత్రి కారు స్వల్పంగా ధ్వంసమైంది.