మామిడి వ్యాపారులపై హరీశ్ ఫైర్

207

హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ లో వ్యాపారులు మామిడి కొనుగోళ్లు నిలిపివేయడం పట్ల మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్బైడ్, చైనా పౌడర్‌ను ఉపయోగించి మామిడికాయలను మార్కెట్‌కి తీసుకు వస్తున్నారని వ్యాపారస్తులు కొనుగోళ్లు నిలిపివేశారు. అయితే వ్యాపారుల వైఖరి సరికాదని హరీశ్ రావు పేర్కొన్నారు. తక్షణమే కొనుగోళ్లను ప్రారంభించాలని వ్యాపారులను ఆదేశించారు. కొనుగోళ్లు ప్రారంభించక పోతే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి ఆదేశం మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం సమక్షంలో వ్యాపారులతో చర్చలు జరుపుతున్నారు.