20 నెల‌లు అధికారం కాపాడుకుంటే గొప్ప‌

197

టీఆర్ఎస్ నేత‌లు ఇర‌వై ఏళ్లు కాదు ఇర‌వై నెలలు అధికారం కాపాడుకుంటే గొప్ప అని బీజేపీ సీనియ‌ర్ నేత నాగం జ‌నార్ద‌న్ రెడ్డి పేర్కొన్నారు. వచ్చే ఇర‌వై ఏళ్లు తెలంగాణ‌లో అధికారం టీఆర్ఎస్ దేన‌ని మంత్రి హ‌రీశ్ రావు చేసిన వ్యాఖ్యల‌పై ఆయ‌న పై విధంగా స్పందించారు. ఆదివారం హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడిన నాగం బినామీ ఆస్తులు కూడబెడ్తున్న కేసీఆర్‌ కుటుంబానికి త‌మిళ‌నాడులో జయలలితకు పట్టిన గతే పడుతుందన్నారు. రైతులను పట్టించుకోని కేసీఆర్‌ ప్రభుత్వం పేక మేడలా కుప్పకూలడం ఖాయమ‌ని జోస్యం చెప్పారు.