నలుగురు ఉగ్రవాదుల కాల్చివేత

212

జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలో చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. సోమవారం ఈ ఘటన జరిగింది. కెరాన్‌ సెక్టార్‌ ప్రాంతంలో చొరబాటుకు యత్నిస్తుండగా.. భద్రతా సిబ్బంది వారిపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు తీవ్రవాదులు హతమయ్యారు.